భారీగా తగ్గిన కొవిడ్ కేసులు

భారీగా తగ్గిన కొవిడ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం 50వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా 45వేల దిగువకు చేరాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,877 మంది కరోనా బారినపడ్డారు. ఈ సంఖ్య శనివారం కన్నా 11శాతం తక్కువ. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి 50వేలలోపు కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన 24 గంటల్లో 684మంది వైరస్ కారణంగా చనిపోయారు. భారత్లో ఇప్పటి వరకు 4,26,31,421 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. చనిపోయిన వారి సంఖ్య 5,08,665కు చేరింది. మొత్తం కేసుల్లో 4,15,85,711 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 5,37,045 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 3.17శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.55శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 172.81 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

ఇస్రో ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్

మోడర్న్ మేడారం!