మూడో టీ20లోనూ ఇండియాదే విక్టరీ

మూడో టీ20లోనూ ఇండియాదే విక్టరీ
  •  3–0తో సిరీస్​ సొంతం
  • చెలరేగిన సూర్యకుమార్‌‌, వెంకటేశ్‌‌
  • 17 రన్స్‌‌ తేడాతో ఓడిన విండీస్‌‌

కోల్‌‌కతా: వెస్టిండీస్‌‌తో వరుసగా రెండో సిరీస్‌‌ను టీమిండియా క్లీన్‌‌ స్వీప్‌‌ చేసింది. బ్యాటింగ్‌‌లో సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (31 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 7 సిక్సర్లతో 65), వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ (19 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 నాటౌట్‌‌) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన ఆఖరిదైన థర్డ్‌‌ టీ20లోనూ ఇండియా 17 రన్స్‌‌ తేడాతో విండీస్‌‌ను చిత్తు చేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను రోహిత్‌‌సేన 3–0తో వైట్‌‌వాష్‌‌ చేసింది. టాస్‌‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 184/5 స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌‌ 20 ఓవర్లలో 167/9 స్కోరు వద్దే ఆగిపోయింది. నికోలస్‌‌ పూరన్‌‌ (47 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 61) ఒంటరిపోరాటం చేశాడు. రొమారియో షెఫర్డ్‌‌ (29), పావెల్‌‌ (25) కాసేపు ప్రయత్నించి విఫలమయ్యారు. సూర్యకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, సిరీస్‌‌’ అవార్డులు లభించాయి. ఫుల్​ టైమ్​ కెప్టెన్​గా రోహిత్​కు ఇది హ్యాట్రిక్​ సిరీస్​ క్లీన్​స్వీప్​. టీ20ల్లో టీమిండియాకు వరుసగా 9వ విక్టరీ కావడం విశేషం. 
పూరన్‌‌.. ఒక్కడే 
భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో విండీస్‌‌కు స్టార్టింగ్‌‌ నుంచే ఇబ్బందులు  ఎదురయ్యాయి. ఇన్నింగ్స్‌‌ ఐదో బాల్‌‌కే మేయర్స్‌‌ (6) ఔట్‌‌కాగా, థర్డ్‌‌ ఓవర్‌‌లో మరో ఓపెనర్‌‌ షాయ్‌‌ హోప్‌‌ (8) కూడా వెనుదిరిగాడు. అయితే ఈ టైమ్‌‌లో క్రీజులోకి వచ్చిన హార్డ్‌‌ హిట్టర్లు నికోలస్‌‌ పూరన్‌‌, రోవ్‌‌మెన్‌‌ పావెల్‌‌ మెరుపులు మెరిపించారు. ఓవర్‌‌కు పది రన్‌‌రేట్‌‌ తగ్గకుండా చూడటంతో ఫస్ట్‌‌ 6 ఓవర్స్‌‌లో విండీస్‌‌ 68/2 స్కోరు చేసింది. అయితే ఏడో ఓవర్‌‌లో పావెల్‌‌ ఔట్‌‌కావడంతో థర్డ్‌‌ వికెట్‌‌కు 47 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. కొద్దిసేపటికే పొలార్డ్‌‌ (5) కూడా వెనుదిరగడంతో విండీస్‌‌ 82/4తో కష్టాల్లో పడింది. అయితే ఓ ఎండ్‌‌లో గట్టిగా పాతుకుపోయిన పూరన్‌‌.. స్పిన్నర్ల బౌలింగ్‌‌లో భారీ షాట్స్‌‌ ఆడాడు. కానీ రెండో ఎండ్‌‌లో హోల్డర్‌‌ (2), రోస్టన్‌‌ ఛేజ్‌‌ (12) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ దశలో రొమారియో షెఫర్డ్‌‌  కీలక ఇన్నింగ్స్‌‌తో ఆకట్టుకున్నాడు. పూరన్‌‌.. 18వ ఓవర్‌‌లో ఔట్‌‌కావడంతో ఏడో వికెట్‌‌కు 48 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఇక విండీస్‌‌ గెలవాలంటే 12 బాల్స్‌‌లో 31 రన్స్‌‌ అవసరమైన దశలో.. హర్షల్‌‌, శార్దూల్​ కట్టడి చేశారు. 
సూర్య ప్రతాపం..
యంగ్‌‌స్టర్స్‌‌కు చాన్స్‌‌ ఇవ్వాలన్న నేపథ్యంలో.. ఇషాన్‌‌ కిషన్‌‌ (31 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 34)తో కలిసి రుతురాజ్‌‌ (4) ఇన్నింగ్స్‌‌ను ప్రారంభించాడు. కానీ థర్డ్‌‌ ఓవర్‌‌లోనే రుతురాజ్​ ఔట్‌‌కావడంతో ఇండియా 10 రన్స్‌‌కే ఫస్ట్‌‌ వికెట్‌‌ కోల్పోయింది. ఈ దశలో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (16 బాల్స్‌‌లో 4 ఫోర్లతో 25), కిషన్‌‌ నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌‌ను బాగు చేసే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు సెకండ్‌‌ వికెట్‌‌కు 53 రన్స్‌‌ జోడించిన తర్వాత.. ఏడు బాల్స్‌‌ తేడాలో పెవిలియన్‌‌కు చేరారు. విండీస్‌‌ స్పిన్నర్లు హైడెన్‌‌ వాల్ష్‌‌ (1/30), రోస్టన్‌‌ ఛేజ్‌‌ (1/23) మిడిల్‌‌ ఓవర్స్‌‌ను బ్రిలియంట్‌‌గా వేయడంతో బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌లో కిందకు వచ్చిన కెప్టెన్‌‌ రోహిత్‌‌ (7) కూడా బ్యాటు ఝుళిపించలేకపోయాడు. 14వ ఓవర్‌‌లో అతను ఔట్‌‌కావడంతో ఇండియా 93/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన సూర్యకుమార్‌‌.. క్లీన్‌‌ హిట్టింగ్‌‌తో కరీబియన్‌‌ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రెండో ఎండ్‌‌లో వెంకటేశ్‌‌ అయ్యర్‌‌ అండగా నిలిచాడు. టైమ్‌‌ చూసి తాను కూడా హిట్టింగ్‌‌కు తెరలేపడంతో.. స్లాగ్‌‌ ఓవర్స్‌‌లో పరుగుల వరద పారింది. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌‌కు కేవలం 37 బాల్స్‌‌లోనే 91 రన్స్‌‌ జోడించడంతో ఇండియా ఇన్నింగ్స్‌‌ తేరుకుంది. ఈ ఇద్దరి దెబ్బకు లాస్ట్‌‌ ఐదు ఓవర్లలో 86 రన్స్‌‌ వచ్చాయి.