ముగిసిన టీమిండియా ఫస్ట్ ఇన్సింగ్స్

ముగిసిన టీమిండియా ఫస్ట్ ఇన్సింగ్స్

సౌథాంప్టన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న WTC ఫైనల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియా 217 రన్స్ కు ఆలౌటైంది. భారత్ బ్యాట్స్ మెన్లలో అజింక్యా రహనే 49, విరాట్ కోహ్లీ 44, రోహిత్ శర్మ 34 రన్స్ చేశారు. ఇక కివీస్ బౌలర్లలో జేమీసన్ 5 వికెట్లతో రాణించగా...వాగ్నర్ రెండు, సౌథీ, బౌల్ట్ చెరో వికెట్ తీశారు. 3 వికెట్ల నష్టానికి 146 రన్స్ తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా...ఓవర్ నైట్ స్కోరుకు మరో 71 రన్స్ జోడించి మిగితా 7 వికెట్లను కోల్పోయింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ జేమీసన్ బౌలింగ్ లో LBWగా అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్ కేవలం 4 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.  ఐతే హాఫ్ సెంచరీకి దగ్గరైన రహానే వాగ్నర్ బౌలింగ్ లో స్లిప్స్ లో దొరికిపోయాడు. లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 211 రన్స్ చేసిన కోహ్లీ సేన తర్వాత 6 రన్స్ తేడాలో మూడు వికెట్లు కోల్పోయింది.