ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం స్టార్ట్ అయ్యాయి. తొలిరోజు మార్నింగ్ సెషన్ లో ఫస్టియర్ సెకండ్ లాంగ్వేజీ ఎగ్జామ్ జరిగింది. ఈ పరీక్షకు 85,165 మంది అటెండ్ కావాల్సి ఉండగా.. 78,113 మంది హాజరయ్యారు. 

ఖమ్మం జిల్లాలో ఇద్దరు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఆఫ్టర్ నూన్ సెషన్ లో సెకండియర్ సెకండ్ లాంగ్వేజీ ఎగ్జామ్ జరిగింది. మొత్తం 32,310 మందికి గానూ ..29,625 మంది అటెండ్ అయ్యారు. హైదరాబాద్ లో ఒక విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది.