పచ్చని పొలాల్లో బీజేపీ రక్తం పారియ్యాలని చూస్తుంది

పచ్చని పొలాల్లో బీజేపీ రక్తం పారియ్యాలని చూస్తుంది

బీజేపీ పార్టీనా.. దర్యాప్తు ఏజెన్సీ నా.. అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీ ఎలా చెప్తారన్నారు. బీజేపీ డైరెక్షన్ లో సీబీఐ పనిచేస్తుందా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవని అన్నారు. నిఘా సంస్థలు బీజేపీకి జేబు సంస్థలుగా మారాయని ఆరోపించారు. బీజేపీ, సీబీఐ కలిసి కావాలనే ప్రతిపక్షాలను వేధిస్తున్నాయని.. 8 రాష్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టి.. దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎద్దేవా చేశారు.

సీబీఐకి మీరు డైరెక్షన్ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారన్న హరీష్.. హైదరాబాద్ లో ఏం జరుగుతోంది. రాష్ట్రంలో మత కలహాలు మంచివా..అని సీరియస్ అయ్యారు. బీడు భూముల్లో నీళ్లు పారియ్యాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తుంటే.. బీజేపీ మాత్రం  బీజేపీ రక్తం పారియ్యాలని చూస్తుందన్నారు. మరోవైపు కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి ఎందుకు చేశారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.