గాజాపై ఇజ్రాయెల్ మిసైల్.. 32 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ మిసైల్.. 32 మంది మృతి
  • మృతుల్లో 12 మంది పిల్లలు

గాజా సిటీ: ఇజ్రాయెల్ ఆర్మీ గాజా సిటీపై వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు జరిపిన దాడుల్లో 32మంది మరణించారు. మృతుల్లో 12 మంది పిల్లలు ఉన్నారని షిఫా హాస్పిటల్ అధికారులు తెలిపారు. గాజా సిటీలోని షేఖ్ రద్వాన్ ప్రాంతంలో ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్​ఆర్మీ జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారని.. అందులో తల్లి, ముగ్గురు పిల్లలు ఉన్నారని వెల్లడించారు. ఇటీవలి రోజుల్లో ఇజ్రాయెల్.. గాజా నగరం అంతటా దాడులను ముమ్మరం చేసింది. బహుళ ఎత్తైన భవనాలను ధ్వంసం చేసింది. హమాస్ వాటిలో నిఘా పరికరాలను ఉంచిందని ఆరోపించింది. 

కాగా, పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సిటీని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్​ ఆర్మీ పిలుపునివ్వడంతో ఇటీవలి వారాల్లో ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వారి సంఖ్య పెరిగిందని కార్మికులు తెలిపారు. అయితే, రవాణా, గృహనిర్మాణ ఖర్చు కారణంగా చాలా కుటుంబాలు ఇక్కడే చిక్కుకుపోయాయి. లక్షలాది మంది ప్రజలు అక్కడే ఉన్నారు. కరువు పరిస్థితులలో తిండికి కూడా ఇబ్బంది  పడుతున్నారు. 

మరోవైపు హమాస్​కు చివరి కంచు కోటగా చెప్పే అతిపెద్ద పాలస్తీనా నగరాన్ని స్వాధీనం చేసుకునే లక్ష్యంతో మిగిలి ఉన్న పాలస్తీనియన్లను సిటీ వదిలి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరించింది. అయితే, ఆగస్టు మధ్య నుంచి సెప్టెంబర్ మధ్య వరకు వెళ్లిపోయిన వారి సంఖ్య దాదాపు లక్ష మందిగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. లక్షలాది మంది వెళ్లిపోవడం వల్ల మానవతా సంక్షోభం మరింత తీవ్రమవుతుందని ఐక్యరాజ్యసమితి, సహాయ బృందాలు హెచ్చరించాయి. 

దక్షిణ గాజాలోని ప్రదేశాలు జనంతో నిండిపోయాయని యూఎన్ తెలిపింది. 2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలోని తీవ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి చొరబడి 251 మందిని అపహరించి.. దాదాపు 1,200 మందిని చంపడంతో గాజాలో యుద్ధం ప్రారంభమైంది. వీరిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం 60,034 మంది మరణించారు. 1,45,870 మంది గాయపడ్డారని హమాస్ పాలిత గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.

మరిన్ని వార్తలు