Anantha Teaser: భాషా డైరెక్టర్తో జగ్గూభాయ్ మూవీ.. అంచనాలు పెంచిన టీజర్

Anantha Teaser: భాషా డైరెక్టర్తో జగ్గూభాయ్ మూవీ..  అంచనాలు పెంచిన టీజర్

జగపతి బాబు, సుహాసిని  ప్రధాన పాత్రల్లో సురేష్ కృష్ణ  రూపొందించిన డివైన్ ఫిల్మ్  ‘అనంత’.  గిరీష్ కృష్ణమూర్తి నిర్మిస్తున్నారు. గురువారం (Nov 13) ఈ మూవీ ఆడియో, టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, పుస్కూర్ రామ్‌‌‌‌ మోహన్ రావు, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు అతిథులుగా హాజరై మూవీ టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సురేష్ కృష్ణ మాట్లాడుతూ ‘పుట్టపర్తి  సత్యసాయి బాబా జీవితంపై  ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. బాబాగారి శత జయంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఇది  మామూలు భక్తి సినిమాలా  ఉండదు.  అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

బాబా గారికి ప్రేమే మతం. కమర్షియల్ సినిమాల్లో ‘బాషా’ ఎలాంటి ట్రెండ్ సెట్ చేసిందో డివైన్ ఫిలిమ్స్‌‌‌‌లో ‘అనంత’ అలాంటి ట్రెండ్ సెట్ చేస్తుంది. ఈ సినిమా తర్వాత బాబా గారి ప్రేమ తత్వం మరింత మందికి చేరువవుతుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీర శంకర్, రచయితలు సాయి మాధవ్ బుర్రా, రాకేందు మౌళి, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

డైరెక్టర్ సురేష్ కృష్ణ సినిమాల విషయానికి వస్తే..తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలకు దర్శకత్వం వహించారు. మోహన్ బాబు, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖ హీరోల సినిమాలను కూడా డైరెక్ట్ చేశాడు. రజినీ కాంత్తో 'భాషా','బాబా', వెంకటేష్తో ' ప్రేమ',' ధర్మచక్ర', చిరంజీవితో 'డాడీ', మాస్టర్, కమల్ హాసన్ 'ఇంద్రుడు చంద్రుడు', మోహన్ బాబుతో 'రాయలసీమ రామన్న చౌదరి', ప్రభాస్ 'రాఘవేంద్ర' వంటి తదితర సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్గా ఎదిగారు. ఇపుడు చాలా గ్యాప్ తీసుకుని.. జగపతి బాబుతో 'అనంత' చేస్తున్నారు.