
- ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం
- నాతో దీపాదాస్ మాట్లాడారు..
- సమాచారం ఇచ్చిన జీవన్ రెడ్డి
హైదరాబాద్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడం, తనకు సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేర్చుకోవడంపై ఆయన అలకబూనిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ఆయన నివాసానికి వెళ్లి సముదాయించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ కూడా ఆయనతో ఫోన్ లో మాట్లాడారు.
అయితే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాకు సమాచారం ఇచ్చారు. పల్లెలన్నీతిరుగుతానని, ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తనకు ఏ పార్టీ నుంచి కాల్ రాలేదని, తనతో బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఎవరూ మాట్లాడలేదని అన్నారు. ఏ పార్టీ తనను ప్రభావింతం చేయలేదని పేర్కొన్నారు. ఇప్పట్లో తాను ఏ పార్టీలోకి వెళ్లదల్చుకోలేదని క్లారిటీ ఇచ్చారు.