JNTU లో ‘బెస్ట్’ ల్యాబ్స్..రూ.18 కోట్లతో జనవరిలో ఏర్పాటు : వీసీ కిషన్ కుమార్ రెడ్డి

JNTU లో ‘బెస్ట్’ ల్యాబ్స్..రూ.18 కోట్లతో జనవరిలో ఏర్పాటు :  వీసీ  కిషన్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ సిటీ, వెలుగు:   స్టూడెంట్లకు మెరుగైన ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ అవకాశాలను కల్పించేందుకు 2027 జనవరి నాటికి రూ. 18 కోట్లతో బజాజ్ ఇంజనీరింగ్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నట్లు జేఎన్​టీయూహెచ్​వీసీ డాక్టర్ టి. కిషన్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జేఎన్​ఆడిటోరియంలో అనుబంధ కాలేజీల ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, యాజమాన్య ప్రతినిధుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. 

ఇందులో పాల్గొన్న వీసీ మాట్లాడుతూ క్యాంపస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏఐసీటీఈ ఇన్నోవేషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు, ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో శ్రామిక శక్తిని తీర్చిదిద్దేందుకు ‘ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఈఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐటీ’ సంస్థకు 12,000 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈపీ-2020) నిబంధనలకు అనుగుణంగా అప్రెంటిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమలు చేయడంతో పాటు, డిమాండ్-ఆధారిత పరిశోధనలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. డైరెక్టర్ డాక్టర్ ఎ. దామోదరం, రిజిస్ట్రార్ ఎ. జయలక్ష్మి, అకడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వి. కామాక్షి ప్రసాద్ పాల్గొన్నారు.