తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది : ఎన్టీఆర్‌, కళ్యాణ్ రామ్

తారకరత్న  ఆరోగ్యం నిలకడగా ఉంది : ఎన్టీఆర్‌, కళ్యాణ్  రామ్

సినీ నటుడు నందమూరి తారకరత్న  ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన సోదరులు ఎన్టీఆర్‌, కళ్యాణ్  రామ్ చెప్పారు. ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నా వైద్యానికి సహకరిస్తున్నారని తెలిపారు. నిన్నటితో పోలిస్తే పరిస్థితి మెరుగ్గా ఉందని డాక్టర్లు చెబుతున్నారని అన్నారు. తాతగారి ఆశీస్సులు, దేవుడి దీవెనలు, అభిమానుల ఆశీర్వాదాలతో తారకరత్న  త్వరగా కోలుకుంటారని చెప్పారు . కర్ణాటక ప్రభుత్వం తరఫున రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ ఎంతో సహకరించారని చెప్పారు.  గుండెపోటు రావడంతో బెంగూళూరులోని నారాయణ హృదయాలయ  హాస్పిటల్ లో తారకరత్న   చికిత్స పొందుతున్నారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. పాదయాత్రలోనే స్పృహ తప్పి కింద పడిపోవడంతో వెంటనే ఆయన్ను కుప్పంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.