
గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్‌కు ప్రస్తుతం 55 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో రిజర్వాయర్ గేట్లను క్లోజ్ చేసి నీటి విడుదల నిలిపివేశారు. జూరాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం 45,587 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 600 క్యూసెక్కులు కలిపి మొత్తం 47,288 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.