పుష్కర స్నానం.. పులకించిన జనం

పుష్కర స్నానం..  పులకించిన జనం
  • నాలుగో రోజు భారీగా తరలొచ్చిన భక్తజనం..కాళేశ్వరంలో ఆధ్యాత్మిక శోభ

అంతర్వాహిని సరస్వతి తీరం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కాళేశ్వరంలో పుణ్యస్నానాలు చేసి సైకత లింగాలను తయారు చేసి స్వామివారిని ఆరాధించారు. త్రివేణి సంగమంలో పూజలు, దీపారాధన చేస్తూ గంగమ్మకు మొక్కులు తీర్చుకున్నారు. సరస్వతి ఘాట్​ వద్ద ఏర్పాటు చేసిన 17 అడుగలు ఏకశిల సరస్వతి మాత, కాళేశ్వర, ముక్తీశ్వరస్వామి, శుభానంద, సరస్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. 

ముత్తయిదువులు వాయినం ఇస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, కాళేశ్వరం– మహదేవ్​పూర్​రోడ్డులో 16 కిలోమీటర్ల దూరం వెహికల్స్​ ఆగిపోవడంతో అడవిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం ఒక్కరోజే లక్షా అరవై వేల మంది భక్తులు పుష్కరస్నానాలకు వచ్చినట్లు దేవాదాయశాఖ ఆఫీసర్లు తెలిపారు. - జయశంకర్‌‌ భూపాలపల్లి/ మహాదేవ్‌‌పూర్‌‌, వెలుగు