
దేశవాళీ క్రికెట్ లో అసాధారణంగా రాణించి ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలో చోటు సంపాదించిన కరుణ్ నాయర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇంగ్లాండ్ తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో డకౌటయ్యాడు. పోప్ పట్టిన సూపర్ క్యాచ్ కు ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులే చేసి నిరాశపరిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో సాయి సుదర్శన్ లాంటి యంగ్ టాలెంటెడ్ బ్యాటర్ ను పక్కనపెట్టి జట్టు యాజమాన్యం కరుణ్ నాయర్ కు మూడో స్థానంలో ప్రమోషన్ ఇచ్చారు.
అయితే వచ్చిన ఈ అవకాశాన్ని కరుణ్ వినియోగించుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 31 పరుగులు చేసి పర్వాలేదనిపించినా రెండో ఇన్నింగ్స్ లో 26 పరుగులే చేసి విఫలమయ్యాడు. వరుసగా రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ ల్లో 19 యావరేజ్ తో ఈ కర్ణాటక బ్యాటర్ 77 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. రాహుల్, గిల్, జైశ్వాల్, పంత్ అద్భుతంగా రాణిస్తున్నా ఈ వెటరన్ ప్లేయర్ మాత్రం విఫలమయ్యాడు. మూడో టెస్టులో కరుణ్ కు ఛాన్స్ దక్కే అవకాశం కనిపించడం లేదు. ఒక్కసారి టీంఇండియాలో ఛాన్స్ కోల్పోతే మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం చాలా కష్టం. అతని వయసు కూడా 33 ఏళ్ళు కావడం మైనస్ గా మారింది.
ALSO READ : గవాస్కర్‌ను వెనక్కి నెట్టిన జైశ్వాల్.. ఇండియాలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా నయా రికార్డ్
Brydon Carse dismissed Karun Nair. pic.twitter.com/CkxWfxgdms
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 5, 2025
2016 లో ఇంగ్లాండ్ పై చెన్నై వేదికగా ట్రిపుల్ సెంచరీ కొట్టి భారత క్రికెట్ తరపున ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. భారత్ తరపున టెస్టులో ట్రిపుల్ సెంచరీ ఒక్కసారిగా అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా సరికొత్త చరిత్ర నెలకొల్పాడు. చెన్నై వేదికగా జరిగిన ఈ టెస్టులో 381 బంతుల్లో 303 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 2017 లో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర ట్రోఫీలో స్థానం దక్కించుకున్న కరుణ్ విఫలమయ్యాడు. ఒక్క సిరీస్ లో విఫలమైనందుకే ఈ కర్ణాటక స్టార్ ను పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగించింది. కరుణ్ కు అన్యాయం జరిగిందని చాలామంది ఆరోపించారు.