IND VS ENG 2025: గవాస్కర్‌ను వెనక్కి నెట్టిన జైశ్వాల్.. ఇండియాలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా నయా రికార్డ్

IND VS ENG 2025: గవాస్కర్‌ను వెనక్కి నెట్టిన జైశ్వాల్.. ఇండియాలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా నయా రికార్డ్

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ టెస్ట్ క్రికెట్ లో సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. కెరీర్ అరంగేట్రం నుంచి జైశ్వాల్ ఆట నెక్స్ట్ లెవల్లో సాగుతుంది. గత ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ పై జరిగిన సిరీస్ లో 700 కు పైగా పరుగులు చేసిన ఈ యువ ఓపెనర్.. తన ఫేవరేట్ ప్రత్యర్థిపై మరోసారి అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో నిలకడగా రాణిస్తున్నాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన జైశ్వాల్.. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 115 పరుగులు చేసి రాణించాడు. ఈ క్రమంలో జైశ్వాల్ తన టెస్ట్ కెరీర్ లో 2000 పరుగుల మార్క్ అందుకున్నాడు. 

జైశ్వాల్ 21 టెస్టుల్లోనే 2000 పరుగులు పూర్తి చేసుకోవడం విశేషం. టీమిండియా తరపున అతి తక్కువ టెస్ట్ ల్లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ 23 టెస్టుల్లో 2000 పరుగులు చేసుకున్న రికార్డును జైశ్వాల్ ను అధిగమించాడు. ఇంగ్లాండ్ పై జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 10 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత జైశ్వాల్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ కు ముందు జైశ్వాల్ కు 10 పరుగులు అవసరం కాగా.. 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్ గా ఫాస్టెస్ట్ 2000 పరుగుల క్లబ్ లో చేరిన ఆటగాడిగా ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డాన్ బ్రాడ్ మాన్ (15 టెస్టులు) కొనసాగుతున్నాడు.  

ALSO READ | IND VS ENG 2025: ఛేజింగ్‌లో మా పవర్ ఏంటో ప్రపంచానికి తెలుసు: బ్రూక్ కాన్ఫిడెంట్

ఇన్నింగ్స్ పరంగా చూసుకున్నా జైశ్వాల్  రాహుల్ ద్రవిడ్,వీరేంద్ర సెహ్వాగ్ లతో సంయుక్తంగా ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు. ఈ ముగ్గురు   40 ఇన్నింగ్స్ ల్లో 2000 పరుగులు మార్క్ చేరుకొని భారత్ తరపున అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 2000 వేల పరుగుల చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. జులై 2023లో తన టెస్ట్ కెరీర్ ప్రారంభం నుండి జైస్వాల్ పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. గత ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 700 పైగా పరుగులు చేసి టెస్ట్ క్రికెట్‌లో వేగంగా 1000 పరుగులు చేసిన రెండవ భారతీయుడుగా నిలిచాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ పై 2000 పరుగుల క్లబ్ లో చేరాడు. 

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ (మ్యాచ్‌ల పరంగా)

యశస్వి జైస్వాల్ – 21
సునీల్ గవాస్కర్ – 23
గౌతమ్ గంభీర్ – 24
రాహుల్ ద్రవిడ్ – 25
వీరేంద్ర సెహ్వాగ్ – 25
విజయ్ హజారే – 26
చతేశ్వర్ పుజారా – 26
సౌరవ్ గంగూలీ – 27
శిఖర్ ధావన్ – 28
ఎంఏకే పటౌడీ – 28
అజింక్య రహానే – 29