IND VS ENG 2025: ఛేజింగ్‌లో మా పవర్ ఏంటో ప్రపంచానికి తెలుసు: బ్రూక్ కాన్ఫిడెంట్

IND VS ENG 2025: ఛేజింగ్‌లో మా పవర్ ఏంటో ప్రపంచానికి తెలుసు: బ్రూక్ కాన్ఫిడెంట్

ఎడ్జ్‎బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతోన్న రెండో టెస్ట్ లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్ లో ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇంగ్లాండ్ గెలవడం దాదాపు అసాధ్యం. ఫస్ట్ ఇన్సింగ్స్‎లో ఇండియా 587 పరుగుల భారీ స్కోర్ చేయగా.. అతిథ్య జట్టు 407 రన్స్ చేసింది. దీంతో టీమిండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది. మొత్తంగా 244 రన్స్ ఆధిక్యంలో నిలిచిన ఇండియా నాలుగో రోజు రెండు సెషన్లు ఆడి 400 ప్లస్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ ఇస్తే  విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయి.

ALSO READ | Heinrich Klaasen: వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ తొలగించండి.. ఐసీసీకి క్లాసన్ డిమాండ్

టీమిండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 13 ఓవర్లలో 64/1 స్కోరుతో మూడో రోజు ఆట ముగించింది. యశస్వి జైస్వాల్‌‌‌‌ (28) ఔటైనా.. కేఎల్ రాహుల్ (28 బ్యాటింగ్‌‌‌‌), కరుణ్ నాయర్ (7 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ముందు 450 పరుగుల లక్ష్యం ఖాయంగా కనిపిస్తుంది. ఈ దశలో ఇంగ్లాండ్ భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేస్తుందా.. లేకపోతే డ్రా కోసం ఆడుతుందా అనే అనుమానాలు సగటు క్రికెట్ అభిమానిలో ఉన్నాయి. ఫ్యాన్స్ కి ఫుల్ క్లారిటీ ఇస్తూ ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

నాలుగో రోజు ఆటకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తానికి తెలుసు ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతున్నా ఛేజ్ చేస్తుందని అని చెప్పాడు. దీంతో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం కోసమే ఆడుతుందని చెప్పకనే చెప్పాడు. మూడో రోజు ఆటలో భాగంగా బ్రూక్ తన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 158 పరుగులు చేసి టీమిండియాపై ఎదురు దాడికి దిగాడు. 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా వికెట్ కీపర్ జెమీ స్మిత్ తో కలిసి 303 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టుకు భారీ భాగస్వామ్యాన్ని దక్కకుండా చేశాడు. తొలి టెస్టులో 371 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన ఇంగ్లాండ్ ఆత్మ విశ్వాసంతో కనిపిస్తుంది.