
సిద్దిపేట రూరల్, వెలుగు: అదైర్యపడొద్దని తాను అండగా ఉంటానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన చిన్ననాటి స్నేహితురాలు వెంకటలక్ష్మికి భరోసా ను ఇచ్చారు. ఇటీవల వెంకటలక్ష్మి భర్త మల్లారెడ్డి మరణించడంతో విషయం తెలుసుకున్న కవిత ఆమెను పరామర్శించారు.
కవిత మాట్లాడుతూ ఆడబిడ్డకు భర్తను కోల్పోవడానికి మించిన కష్టం ఇంకొకటి ఉండదని, ఆమె ఈ కష్టం నుంచి బయట పడాలని, వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు.