ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–17 రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచిందని, జట్టులో ఉన్న తమ విద్యార్థులు జి.జెస్సీ, ఎండీ.అనూస్ ఉత్తమ ప్రతిభ కనబరిచారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లో ఇటీవల జరిగిన అండర్–19 బాలబాలికల టేబుల్ టెన్నిస్ పోటీల్లో జిల్లా బాలుర జట్టు ద్వితీయ స్థానంలో నిలిచిందని, ఇందులో తమ విద్యార్థులు మోహిత్ కృష్ణ, అఖిలేష్, ప్రజ్ఞాన్ ఉన్నట్లు పేర్కొన్నారు. బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలవగా.. తమ విద్యార్థిని అమృత ప్రతిభ కనబరిచిందని చెప్పారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో విద్యార్థులతోపాటు కోచ్ యాకూబ్ అలీని అభినందించారు.
