గ్రేటర్ హైదరాబాద్ పీవీ నరసింహరావు ఎక్స్ ప్రెస్ వే (PVNR) పై రోడ్డు ప్రమాదం జరిగింది. 2026 నవంబర్ 10న ఉదయం హైవేపై 170 పిల్లర్ దగ్గర కియా కారు పల్టీ కొట్టింది. వేగంతో వచ్చిన కారు పడిపోవడంతో కారు నుజ్జు నుజ్జయింది. మరో కారు డ్యామేజయ్యింది.
అతి వేగంగా వచ్చిన కియా కారు పిల్లర్ నంబర్ 170 దగ్గర అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కార్ డ్రైవర్ తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. రోడ్డుకు అడ్డంగా కార్ పడిపోవడం తో pvnr పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు అతి కష్టం మీద ట్రాఫిక్ క్లియర్ చేశారు.
