KiranAbbavaram: తండ్రైన హీరో కిరణ్ అబ్బవరం.. హనుమంతుడే మా ఇంటికి వచ్చాడంటూ ఫోటో షేర్

KiranAbbavaram: తండ్రైన హీరో కిరణ్ అబ్బవరం.. హనుమంతుడే మా ఇంటికి వచ్చాడంటూ ఫోటో షేర్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యాడు. గురువారం (2025 మే 22న) ఆయన సతీమణి రహస్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం X వేదికగా పంచుకున్నారు. బాబు కాలిని ముద్దాడుతూ ఫోటోను షేర్ చేశాడు.

'మగబిడ్డ పుట్టాడు.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.. థ్యాంక్యూ రహస్య. జై శ్రీరామ్'' అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. తన ఇష్టదైవం హనుమంతుడి జయంతి రోజే కొడుకు జన్మించడం స్వయంగా హనుమంతుడే మా ఇంటికి వచ్చినట్టు ఉందని కిరణ్ సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గతేడాది ఆగస్టులో కిరణ్ అబ్బవరం..రహస్య వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 2025 జనవరి 21న ప్రెగ్నెన్సీ ప్రకటించారు. రాజావారు రాణిగారు షూటింగ్‌లోనే కిరణ్ - రహస్యల మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది.

దాదాపు ఐదేళ్ల పాటు ర‌హ‌స్య ప్రేమాయ‌ణం సాగించిన ఈ జంట 2024 ఆగస్ట్లో పెళ్లితో కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టారు. పెళ్లి తర్వాత రహస్య సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం స్థాపించిన క ప్రొడక్షన్స్ బాధ్యతలను నిర్వహిస్తుంది.

కిరణ్ అబ్బవరం.. గతేడాది `'క' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. 'రీసెంట్ గానే 'దిల్ రూబా'తో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ‘కె- ర్యాంప్‌’ సినిమాలో నటిస్తున్నారు. జైన్స్‌ నాని దర్శకత్వం వహిస్తున్నారు.