
మోదీ ప్రధాని అయ్యాక రైల్వేలో కొత్త శకం మొదలుయిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశంలో అన్ని స్టేషన్ లను రెనోవేషన్ చేస్తున్నారని, ఇందుకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కాచిగూడలో ఆయన జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలంగాణకు ఇది మూడవ వందే భారత్ ట్రైన్ అని చెప్పారు.
Also Read : బయటపడ్డ హిట్స్ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్ అక్రమాలు
సంక్రాంతి, ఉగాది రోజున రెండు ట్రైన్స్ మోడీ రాష్ట్ర ప్రజల కు గిఫ్ట్ గా ఇస్తే వినాయక చవితి సందర్భంగా మూడవ ట్రైన్ కు గిప్ట్ గా ఇచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రిగా, సికింద్రబాద్ ఎంపీగా రైల్వే పనులను ప్రధానితో , రైల్వే మంత్రితో తాను చర్చిస్తున్నానని తెలిపారు. ఇక రైల్వేల ఆధునికీకరణపై గత ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు.