ఆర్మీ ల్యాండ్ ను కబ్జా చేశారని ఫిర్యాదు.. మేడ్చల్ కలెక్టరేట్ గ్రీవెన్సీలో దరఖాస్తు

ఆర్మీ ల్యాండ్ ను  కబ్జా చేశారని ఫిర్యాదు.. మేడ్చల్  కలెక్టరేట్ గ్రీవెన్సీలో దరఖాస్తు

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: దుండిగల్ మండలంలోని కొంపల్లి గ్రామంలో ఆర్మీ రీసెర్చ్ కోసం కేటాయించిన 776 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురు కబ్జా చేశారంటూ బీజేపీ నేత ఆకుల సతీశ్​ అడిషనల్​ కలెక్టర్​ విజేందర్​రెడ్డికి ఫిర్యాదు చేశారు. సోమవారం మేడ్చల్​ కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో దరఖాస్తు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్​ తప్పుగా చూపిస్తూ 3.6 ఎకరాల ఆర్మీ భూమిని ఎమ్మెల్యే వివేకానంద అనుచరుడు కిషన్ రావు తో పాటు పలువురు కబ్జా చేశారని ఆరోపించారు. కబ్జా భూమిలో దర్జాగా వెంచర్ ఏర్పాటు  చేస్తున్నారని చెప్పారు. వారిపై చర్యలు తీసుకుని భూమిని కాపాడాలని కోరారు.