ట్రంప్, అదానీ కోసమే శాంతి బిల్లుకు ఆమోదం..కేంద్రంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఫైర్

ట్రంప్, అదానీ కోసమే శాంతి బిల్లుకు ఆమోదం..కేంద్రంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఫైర్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్, అదానీ గ్రూప్  చైర్మన్  గౌతమ్  అదానీ కోసమే శాంతి బిల్లును పార్లమెంటులో క్లియర్  చేశారని కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్లు) జైరాం రమేశ్  విమర్శించారు. పార్లమెంటు ఆ బిల్లును ఆమోదించడంతో ఇప్పుడు అదానీ గ్రూప్  న్యూక్లియర్  ఎనర్జీ సెక్టార్ లోకి వచ్చేందుకు ప్లాన్  చేస్తోందని ‘ఎక్స్’ లో ఆయన వ్యాఖ్యానించారు.

 ‘‘న్యూక్లియర్  లయబిలిటీ రూల్స్ పై అమెరికా, భారత్  మధ్య జాయింట్  అసెస్ మెంట్ ఉంటుందని కొత్త చట్టంలో పేర్కొన్నారు. అంటే ఎవరి కోసం ఈ చట్టం చేశారో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థం అవుతోంది. ఒకటి, న్యూక్లియర్  ఎనర్జీ రంగంలో ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించడం. 

అంటే పరోక్షంగా అదానీకి ఈ రంగంలో రెడ్ కార్పెట్  పరిచి ఆహ్వానించడం. రెండోది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  కోసం. 2026 యూఎస్ నేషనల్  డిఫెన్స్  ఆథరైజేషన్  యాక్ట్ పై ట్రంప్  సంతకం చేశారు” అని జైరాం రమేశ్  పేర్కొన్నారు.