- ఫెయిల్యూర్లను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని సాకులు చెప్తున్నరు: ఖర్గే
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతీ విషయాన్ని ప్రతిపక్షం మీదకు నెడుతున్నాడని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మోదీ తన ఫెయిల్యూర్లను కప్పిపుచ్చుకునేందుకు సాకులు చెప్తున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశ్ అక్రమ వలసలపై మోదీ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారని, బార్డర్లను సంరక్షించలేక ప్రతిపక్షాన్ని నిందిస్తున్నారని విమర్శించారు.
ఆదివారం అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ జాతివ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ మార్గాల్లో వచ్చిన వలసదారులు అస్సాంలో స్థిరపడాలని కోరుకుంటోందని అన్నారు. ఓటు బ్యాంకు కోసమే ఇలా చేస్తోందని, అస్సాం ప్రజల గురించి పట్టించుకోవడంలేదని విమర్శించారు.
మల్లికార్జున ఖర్గే దీన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోనూ, అస్సాంలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉందని గుర్తుచేశారు. వాళ్లు తమది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటారు కానీ పరిపాలన చేతకాదన్నారు. తాము టెర్రరిస్టులను, వలసదారులనో కాపాడటం లేదని, దేశ హితం కోసమే పనిచేస్తామని స్పష్టం చేశారు.
కర్నాటకలో లీడర్ షిప్‌పై హైకమాండ్‌కు క్లారిటీ ఉంది
కలబుర్గి: కర్నాటకలో నాయకత్వంపై కాంగ్రెస్ హైకమాండ్‌కు పూర్తి క్లారిటీ ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. స్థానికంగానే కొంత గందరగోళం ఉందన్నారు. ఆదివారం కర్నాటకలోని కలబుర్గిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘హైకమాండ్ ఎలాంటి కన్ఫ్యూషన్ సృష్టించడం లేదు. స్థానిక స్థాయిలోనే గందరగోళం ఉంది. హైకమాండ్‌పై నిందలు వేయడం సరికాదు?’’ అని ఖర్గే అన్నారు.
హైకమాండ్‌ను నిందించడం కంటే, అంతర్గత వివాదాలను వారే పరిష్కరించు కోవాలని స్థానిక నాయకులకు సూచించారు. ‘‘ప్రతి ఒక్కరూ పార్టీని నిర్మించారు. కాంగ్రెస్‌ను పార్టీ కార్యకర్తలే నిర్మించారు. వారి సపోర్ట్ తోనే ఇది సాధ్యమైంది” అని ఖర్గే అన్నారు. కర్నాటకలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే మధ్య కొనసాగుతున్న అధికార పోరు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
