- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అబ్దుల్లా, పులి దేవేందర్
హైదరాబాద్, వెలుగు: పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శిగా పులి దేవేందర్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పి. వెంకట్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రావుల కార్ వెంకటేష్ ఎన్నికయ్యారు.
నూతన కార్యవర్గ ఎన్నిక అనంతరం బాధ్యతలు స్వీకరించిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడారు. టీచర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. టీచర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న జీవో 317 సమస్యను పరిష్కరించడానికి, జీవో 190 ప్రకారం స్థానిక జిల్లాలకు రెండేండ్ల డిప్యూటేషన్ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు, ఇతర ఆర్థిక బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.
