నాయకోటి సుజాతకు డాక్టరేట్

నాయకోటి సుజాతకు డాక్టరేట్

హైదరాబాద్​సిటీ, వెలుగు: తెలంగాణ వర్సిటీ నుంచి నగరానికి చెందిన నాయకోటి సుజాత గురువారం పీహెచ్ పట్టా అందుకున్నారు. ఆమె ఆచార్య కరిమిండ్ల లావణ్య పర్యవేక్షణలో ‘తెలంగాణలో దేవులపల్లి రామానుజారావు స్థానం’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. డాక్టర్ దేవులపల్లి రామానుజరావు తెలుగు భాషాభివృద్ధి కోసం బొగ్గుల కుంటలో తెలంగాణ సారస్వత పరిషత్తు ఏర్పాటు చేసి జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి అని అన్నారు. 

పూర్వ కళల పీఠాధిపతి ప్రొఫెసర్​కనకయ్య, తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షుడు, పాఠ్య ప్రణాళిక సంఘం చైర్మన్ లక్ష్మణ చక్రవర్తి, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ త్రివేణి, కంట్రోలర్  సంపత్​కుమార్, ప్రొఫెసర్లు హారతి, రవీందర్ రెడ్డి, అపర్ణ, అబ్దుల్ ఖవి, గుల్​ఏ రానా పాల్గొన్నారు.