
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడుతున్న అవమానకర భాషను కేటీఆర్ వెంటనే మార్చుకోవాలని లేదంటే తర్వాత జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజలు ఛీకొట్టి అధికారం నుంచి దింపివేసినా కేటీఆర్ తీరు మారలేదని, ఆయన తీరు ఇలానే కొనసాగితే త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. తెలంగాణ సమాజం అన్ని గమనిస్తోందని, కాంగ్రెస్ ప్రజా పాలనపై కేటీఆర్, బీఆర్ఎస్.. సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసినంత మాత్రాన జనం నమ్మరని గుర్తు చేశారు.