ఈటల రాజేందర్కు కేటీఆర్ పరామర్శ

ఈటల రాజేందర్కు కేటీఆర్ పరామర్శ

హైద‌రాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య(104) మరణించారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మ‌ల్లయ్య సిద్దిపేటలోని ఆర్‌వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు. బుధవారం మధ్యాహ్నం కమలాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. మ‌ల్లయ్య మృతిప‌ట్ల  కేటీఆర్ సంతాపం తెలిపారు. ఈటల రాజేందర్ కు ఫోన్ చేసి మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ ట్వీట్ చేశారు. ఈట‌ల కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి ప్రక‌టించారు. మల్లయ్యకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుర్లు ఉన్నారు. ఈట‌ల రాజేంద‌ర్ రెండో కుమారుడు.