
కుమ్రంబీమ్ జిల్లా ఇప్పల్ నవేగామ్ లో భూ మాఫియా రెచ్చిపోతుంది. ఊరంతా మాదే నంటూ ఓముగ్గురు గ్రామంలో ఉన్న 100 ఇండ్లను ఖాళీ చేయాలంటూ అల్టిమేటంజారీ చేశారు. దీంతో బాధితులు ఆర్డీఓకు బెదిరిస్తున్నవారిపై ఫిర్యాదుచేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...
కుమ్రంబీమ్ జిల్లా ఇప్పల్ నవేగామ్ కు చెందిన భూమి తమదేనని.. తమ పేరున పట్టా ఉందని ఆసిఫాబాద్ మండలానికి చెందిన శ్రీనివాస్.. చరణ్ దాస్.. మనోజ్ అనే ముగ్గురు వ్యక్తులు గ్రామంలోని 100 కుటుంబాల వారిని ఖాళీ చేయాలని రెండు సంవత్సరాల నుంచి బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ స్థలంలో 200 సంవత్సరాల నుంచి తమ పూర్వీకులు ఉంటున్నారని.. ఇంటిపన్ను.. కరంట్ బిల్లులు కూడా చెల్లిస్తున్నామని బాధితులు తెలిపారు.
ALSO READ | రామగుండంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు..తప్పిన పెను ప్రమాదం