
పెద్దపల్లి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు అధికారులు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డుగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు అధికారులు. మార్కండేయ కాలనీ పరిధిలోని రాజేష్ టాకీస్ సమీపంలో ఓ బిల్డింగ్ను కూల్చేవేశారు అధికారులు.
అయితే కూల్చేవత సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో బిల్డింగ్ ముందు భాగాన్ని కూల్చివేస్తుండగా ఒక్కసారిగా బిల్డింగ్ ఓ పక్కకు పడిపోయింది. దీంతో జేసీబీ డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ALSO READ | కడెం ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్
అక్రమ నిర్మాణాల కూల్చివేతల సమయంలో ముందుగానే వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బిల్డింగ్ కూలిన సమయంలో పెద్ద ఎత్తున దుమ్ములేచి ఆ ప్రాంతమంతా ఏమీ కనిపించకుండా కమ్ముకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.