నాణ్యమైన విద్యనందించేందుకే యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు : కలెక్టర్ కుమార్ దీపక్

నాణ్యమైన విద్యనందించేందుకే యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు : కలెక్టర్ కుమార్ దీపక్
  •     ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్ 

బెల్లంపల్లి, వెలుగు : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్​ను ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో అధికారులతో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో జిల్లాలో 3 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలో రూ.200 కోట్లతో నిర్మాణానికి అనువైన 25 ఎకరాల విస్తీర్ణంలో పాఠశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు కేటాయించిందని తెలిపారు. జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల అభివృద్ధికి ఒక్కొక్క పాఠశాలకు రూ.కోటి చొప్పున మంజూరు చేసినట్లు వివరించారు. 

రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాలో ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీఏ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, టీజీఈడబ్ల్యూఐ డీసీఈఈ, జిల్లా విద్యాధికారి యాదయ్య, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జె.సంపత్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.