- కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక
ఖానాపూర్, వెలుగు : ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దయానంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం హెచ్చరించారు. శుక్రవారం ఖానాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొందరు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరిట రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేస్తున్న కృషి వీరికి కనబడడం లేదా..? అంటూ ప్రశ్నించారు.
ప్రతి నియోజకవర్గానికి రెండు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేస్తామని ఇదివరకే సీఎం ప్రకటన చేశారని గుర్తుచేశారు. రెండో విడతలో ఖానాపూర్ కు తప్పకుండా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరవుతుందని తెలిపారు. సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ సత్యం, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్, నాయకులు పాల్గొన్నారు.
