హీరోగా నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు

 హీరోగా నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు

‘ఆర్ఆర్ఆర్’తో సహా పలు భారీ చిత్రాలను నిర్మించిన డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ హీరోగా పరిచయమవుతున్నాడు. అ, కల్కి లాంటి డిఫరెంట్‌‌‌‌ మూవీస్‌‌‌‌ తీసిన ప్రశాంత్‌‌‌‌ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. గౌరీ హరి సంగీతం అందిస్తున్నాడు. నిన్న ఈ మూవీని అఫీషియల్‌‌‌‌గా అనౌన్స్‌‌‌‌ చేయడంతో పాటు టైటిల్, ఫస్ట్ లుక్‌‌‌‌, వీడియో గ్లింప్స్‌‌‌‌ విడుదల చేశారు. మూవీకి ‘అధీర’ అనే టైటిల్‌‌‌‌ని ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్, రామ్‌‌‌‌ చరణ్‌‌‌‌, రాజమౌళి కలిసి ఫస్ట్‌‌‌‌లుక్‌‌‌‌ను లాంచ్‌‌‌‌ చేశారు. నల్లని ముసుగు, వజ్రాయుధం లాంటి కత్తి పట్టుకుని సూపర్‌‌‌‌‌‌‌‌ హీరోగా కనిపిస్తున్నాడు కళ్యాణ్‌‌‌‌. పురాణాల్లోని పాత్రల స్ఫూర్తితో ఈ సూపర్ హీరో క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ని డిజైన్ చేశాడట ప్రశాంత్ వర్మ. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రిక్‌‌‌‌ ఎనర్జీని పుట్టించే స్పెషల్‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ఉన్న కుర్రాడు, పెరిగి పెద్దవాడై మరింత బలవంతుడవుతాడు. చెడును నాశనం చేయడానికి, అమాయకులను రక్షించడానికి అతను ఎలాంటి సాహసాలు చేశాడనేది మెయిన్ కాన్సెప్ట్. ఇప్పటికే తేజ సజ్జతో ‘హను–మాన్’ అనే సూపర్ హీరో మూవీ తీస్తున్న ప్రశాంత్‌‌‌‌.. నెక్స్ట్ కూడా అలాంటి మూవీనే సెలెక్ట్ చేసుకోవడం విశేషం.