డొమెస్టిక్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా ‘అగ్ని’ పేరుతో 5జీ ఫోన్‌ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. 90 హెజ్ డిస్‌ప్లే, 64 ఎంపీ బ్యాక్ కెమెరా, 30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ప్రత్యేకతలు దీనిసొంతం. అగ్ని 5జీలో మీడియాటెక్ 810 ప్రాసెసర్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, వెనుక క్వాడ్ కెమెరా సెటప్, 6.78 ఇంచుల స్క్రీన్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. 8జీబీ+128 జీబీ వెర్షన్ ధర రూ.20 వేలు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, లావా ఈ-స్టోర్ ద్వారా ప్రిబుకింగ్ చేసుకుంటే రూ.రెండు వేల డిస్కౌంట్ పొందవచ్చు.
