అధికారమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలె : సునీల్ బన్సల్

అధికారమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలె : సునీల్ బన్సల్

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదను పెడుతోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. రాబోయే 60 రోజుల్లో 9వేల కార్నర్ మీటింగ్‭లు పెట్టాలని నేతలు టార్గెట్ గా పెట్టుకున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో నిర్వహించిన మెదక్ పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న సునీల్ బన్సల్..  పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. యూపీలో రెండోసారి అధికారంలోకి రావడానికి తీసుకున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలను సూచించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలని బన్సల్ పిలుపునిచ్చారు. 

యూపీలో రెండోసారి అధికారంలోకి రావడంలో సునీల్ బన్సల్ కీలకంగా వ్యవహరించారని ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా హైకమాండ్ ఆయనను ఇక్కడకు పంపిందని చెప్పారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసినట్లు అర్వింద్ ప్రకటించారు.