- ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో కలిసి పోటీచేస్తామని వెల్లడి
ముంబై: శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే కుమారులు.. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే 20 సంవత్సరాల తర్వాత కలిశారు. బుధవారం వారిద్దరూ కలిసి సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. రాబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్టు వెల్లడించారు.
ఇక నుంచి తాము ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే తమ రెండు పార్టీలు కలిసి వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర నాయకత్వం ఠాక్రే కుటుంబానికే చెందుతుందన్నారు. ఠాక్రేలు మాత్రమే మహారాష్ట్రను నడిపించగలరని అన్నారు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌కు, ముంబై, మహారాష్ట్ర అంతటా ఉన్న 27 ఇతర మున్సిపల్ కార్పొరేషన్‌లకు సీట్ల పంపకాల ఏర్పాట్లు ఇప్పటికే ఖరారు అయ్యాయని తెలిపారు.
