పట్టుకున్న పులిని.. బూటు కాళ్లతో తొక్కి చంపిన పోలీసులు

పట్టుకున్న పులిని.. బూటు కాళ్లతో తొక్కి చంపిన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు ఓ చిరుతుపులిని  అదుపు చేసే క్రమంలో అది ఊపిరాడక మృత్యువాత పడింది.  సంభాల్‌లోని రసూల్‌పూర్ ధాత్రా గ్రామంలో చిరుతపులి ఓ  ఇంట్లోకి ప్రవేశించింది. దీంతో  భయబ్రాంతులకు గురైన స్థానికులు ఆ పులి నుంచి తప్పించుకునేందుకు  పోలీసులకు, అటవీ శాఖ  అధికారులకు సమాచారం ఇచ్చారు.  

వెంటేనే అక్కడికి చేరుకున్న పోలీసులు  రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.  ఈ క్రమంలో  చిరుతపులి ఓ పోలీసు అధికారిపై  దాడికి దిగింది.  దీంతో వెంటనే అలర్ట్ అయిన మిగితా సిబ్బంది..  వల వేసి చిరుతను బంధించారు.  అనంతరం పోలీసు సిబ్బంది మొత్తం ఆ చిరుతపై బూటు కాళ్లతో తొక్కి నిలుచున్నారు.  

ఆ బరువును తట్టుకోలేక ఆ చిరుత ఊపిరాడక  మృత్యువాత పడింది.  రెస్క్యూ ఆపరేషన్ సమయంలో, ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ పాదాలకు గాయమైంది. జంతువు సమీపంలోని అడవి నుండి గ్రామంలోకి వచ్చి ఉండవచ్చని అధికారులు అంచానా వేశారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .