
- ఐడీబీఐ, రూపే ప్లాట్‌ఫామ్‌తో కలసి ‘షగున్’ పేరుతో గిఫ్ట్ కార్డు
శుభ కార్యాలకు వెళ్లినప్పుడు బంధువులకు, లేదా స్నేహితులు, ఆత్మీయులు తదితరులకు గిఫ్టులు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఈ మద్య కాలంలో కొత్త ట్రెండ్ మొదలైంది. అదేమిటంటే డబ్బులు, గిఫ్టులకు బదులు గిఫ్టు కార్డులు ఇవ్వడం. దీనికి మంచి ఆదరణ లభిస్తుండడంతో ఎల్ఐసీ రంగంలోకి దిగింది. ‘షగున్’ పేరుతో ఓ గిఫ్ట్ కార్డును విడుదల చేసింది.
మొబైల్ ఫోన్లు వచ్చాక దేశమంతటా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గిఫ్టుల విషయంలోనూ అలాగే వ్యవహరించడం ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో ఎల్‌ఐసీ షగున్ గిఫ్ట్ కార్డులను తొలివిడుతగా ఎల్ఐసి అసోసియేట్లు, సబ్సిడైజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అధికారిక సమావేశాలు, వేడుకల్లో వీటిని వినియోగించుకోవచ్చు
గిఫ్టులు ఇవ్వడంలో కొత్త పుంతలు
ఎల్ఐసి ప్రవేశపెట్టిన షగున్ గిఫ్ట్ కార్డు సమాజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని ఎల్‌సీఐ దీమా వ్యక్తం చేస్తోంది. ఈ కార్డులో రూ.500 నుండి మొదలు రూ.10 వేల వరకు లోడ్ చేసుకోవచ్చు. మూడేళ్ల కాలంలో ఈ కార్డులోని డబ్బును వినియోగదారుడు వాడుకోవచ్చు. ఈ కార్డు దేశంలో లక్షల షాపులు, ఈ కామర్స్ వెబ్‌సైట్ల లావాదేవీల చెల్లింపునకు కూడా వాడుకోవచ్చని చెబుతోంది. అంతేకాదు డిపార్ట్‌మెంటల్ స్టోర్స్, పెట్రోల్ పంప్స్, రెస్టారెంట్లు, జ్యువెలరీ దుకాణాల్లో కూడా ఈ కార్డును వినియోగించుకోవచ్చని చెబుతోంది. ఇప్పుడు మొబైల్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారాచేస్తున్న చెల్లింపులన్నీ షగున్ ద్వారా చేయొచ్చని చెబుతోంది. అంతేకాదు కాంటాక్ట్‌లెస్ ఫీచర్ కూడా ఉంది. అలాగే ట్యాప్ అండ్ గో విధానంలోనూ ఈ కార్డును వాడుకోవచ్చు. అంటే పిన్ ఎంటర్ చేయకుండానే... రూ.ఐదు వేల వరకు డబ్బును కాంటాక్ట్ లెస్ విధానంలో చెల్లించొచ్చు. వీటితోపాటు పర్సనలైజ్ ఆప్షన్ ద్వారా ఎవరికైనా గిఫ్టుగా ఇచ్చేటప్పుడు దాని మీద మీ సందేశం రాసి ఇవ్వొచ్చు. అంతేకాదు యాప్‌లో మీ కార్డుకు సంబంధించిన సమాచారాన్ని రియల్ టైమ్‌లో చూసుకోవచ్చు. ఎంత ఖర్చు పెట్టారు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది అనే వివరాలు ఎప్పటికప్పుడు తెలిసిపోయే ఫీచర్స్ అన్నీ ఉన్నాయని ఎల్ఐసీ చెబుతోంది.