నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత

నల్లగొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేశారు. ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో డ్యామ్ గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది.ఈ నేపధ్యంలో సోమవారం గేట్లు ఎత్తి నీటివిడుదల ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు భారీ వరద పోటెత్తుతుండడంతో ఒకరోజు ముందుగానే గేట్లు ఎత్తివేశారు. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద 14 గేట్లు  5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. నాగార్జునసాగర్ కు ప్రస్తుతం ఇన్ ఫ్లో : 5 లక్షల 14 వేల386 క్యూసెక్కులు ఉంది. దీంతో 14 గేట్లు ఎత్తి  లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం  590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులు గా ఉంది. ఎగువ నుండి వస్తున్న వరదను బట్టి గేట్లను ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయి సామర్థ్యం  312 టీఎంసీలు కాగా ప్రస్తుతం  300 టీఎంసీలు నిల్వ చేస్తూ నీటి విడుదల చేస్తున్నారు.