లిమ్స్ హాస్పిటల్ ఔదార్యం.. నాలుగు అంబులెన్స్ల వితరణ

లిమ్స్ హాస్పిటల్ ఔదార్యం.. నాలుగు అంబులెన్స్ల వితరణ

హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం సుమారు రూ.50 లక్షల విలువ చేసే నాలుగు అంబులెన్స్​లను ఉచితంగా అందజేసింది. వీటిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సమాజానికి లిమ్స్ హాస్పిటల్ తమ వంతు సేవ చేయడం అభినందనీయమన్నారు. హాస్పిటల్ ఎండీ రామ్​రాజ్ మాట్లాడుతూ..  గోల్డెన్ అవర్స్​లో బాధితులను హాస్పిటల్​కు తరలించడానికి ఈ అంబులెన్స్​లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సమాజ సేవకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.