
విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న టీమిండియా వర్సె్స్ పాకిస్తాన్ మ్యాచ్లో టీమిండియా ఆలౌట్ అయింది. నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు నిలిపింది. పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. 48 పరుగుల దగ్గర టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. స్మృతి మందన 23 పరుగులకు ఔట్ అయింది. ఫాతిమా సనా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి ఈ స్టార్ బ్యాటర్ నిరాశపరిచింది.
హర్లీన్ డియోల్ 46 పరుగులు, రిచా ఘోష్ 35 పరుగులు (నాటౌట్), జెమిమా రోడ్రిగ్యూస్ 32 పరుగులు, ప్రతీక రావల్ 31 పరుగులు, దీప్తి శర్మ 25 పరుగులు, స్నేహ్ రాణా 20 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో డయానా బేగ్ 4 వికెట్లతో రాణించింది. సాదియా ఇక్బాల్ 2, ఫాతిమా సన 2 వికెట్లు తీశారు. రమీన్ షామిమ్, నష్రా సంధు చెరో వికెట్ తీశారు. ఆసియా కప్‌లో పాక్ ప్లేయర్లకు సూర్యకుమార్ సేన షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో టీమిండియా అమ్మాయిలు కూడా పాక్‌తో ‘నో హ్యాండ్‌షేక్’ ప్రొటోకాల్‌ను కొనసాగించారు.
►ALSO READ | Harjas Singh: వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. 35 సిక్సర్లతో హోరెత్తించిన ఆస్ట్రేలియా బ్యాటర్
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇరు దేశాల మహిళల జట్లు అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 27 సార్లు తలపడగా, ఇండియా 24 మ్యాచ్‌ల్లో గెలిచింది. వన్డే ఫార్మాట్‌లో అయితే పాక్‌తో ఆడిన 11 మ్యాచ్‌ల్లోనూ నెగ్గి 100 శాతం సక్సెస్ రికార్డుతో ఉంది. అదే జోరును ఇప్పుడు కూడా కొనసాగించాలని హర్మన్‌సేన భావిస్తోంది. బ్యాటింగ్లో తడబడినా బౌలింగ్లో రాణించి పాక్ ను కట్టడి చేసి సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. తొలి వన్డేలో ఆల్‌రౌండర్ పెర్ఫామెన్స్‌తో శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ సాధించిన మన టీమ్ ఫుల్‌జోష్‌లో ఉండగా.. బంగ్లాదేశ్ చేతిలో 7 వికెట్ల తేడాతో అనూహ్యంగా చిత్తయిన పాక్ తీవ్ర ఒత్తిడిలో ఉంది.