హైదరాబాద్ నార్సింగిలో ఘోరం ఆగి ఉన్న బైకు,కారును ఢీకొన్న BMW.. మహిళకు తీవ్ర గాయాలు..

హైదరాబాద్ నార్సింగిలో ఘోరం ఆగి ఉన్న బైకు,కారును ఢీకొన్న BMW.. మహిళకు తీవ్ర గాయాలు..

హైదరాబాద్ నార్సింగిలో ఘోర ప్రమాదం జరిగింది. నార్సింగి పరిధిలోని మైహోం అవతార్ సర్కిల్ దగ్గర BMW కారు ఆగి ఉన్న బైకును ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ( అక్టోబర్ 4 ) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మైహోమ్ అవతార్ సర్కిల్ దగ్గర ఓ కారు బైకు ఆగి ఉండగా.. వెనక నుంచి వేగంగా వచ్చిన BMW కారు రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

BMW కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో వచ్చి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో మరో కారు, బైకు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

►ALSO READ | విశాఖ యారాడ బీచ్లో విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయి విదేశీయుడు మృతి

BMW కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్లు తెలిపారు పోలీసులు. ప్రమాదం జరిగిన తర్వాత కారు అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడని తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.