భార్యతో గొడవ... కరెంటు పోల్ ఎక్కి వ్యక్తి హల్చల్...

భార్యతో గొడవ...  కరెంటు పోల్ ఎక్కి వ్యక్తి హల్చల్...

మేడ్చల్ జిల్లాలో ఓ వ్యక్తి భార్యతో గొడవపడి కరెంటు పోల్ ఎక్కి హల్చల్ చేశాడు. భార్యహతో గొడవపడి కరెంటు పోల్ ఎక్కి చనిపోతానంటూ హంగామా సృష్టించాడు ఓ వ్యక్తి. ఆదివారం ( అక్టోబర్ 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని వికలాంగుల కాలనీలో నివాసముంటున్న వెంకటేష్ భార్య గొడవ పడి కరెంటు పోల్ ఎక్కి చనిపోతానంటూ హల్చల్ చేశాడు. వెంకటేష్ కు భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే  అలవాటు ఉన్న వెంకటేష్ రోజు భార్యను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు.

ఎప్పటిలాగే  శనివారం రాత్రి భార్య భర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది.. మాట మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకోగా లక్ష్మి చేతులు విరిగేలా కొట్టాడు వెంకటేష్. దీంతో జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లక్ష్మి. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న భయంతో కరెంటు పోల్ ఎక్కి చనిపోతాయానంటూ హంగామా సృష్టించాడు వెంకటేష్.

►ALSO READ | మహబూబాబాద్ లో ఘోరం.. అదుపుతప్పి ఆటో బోల్తా... నలుగురికి తీవ్ర గాయాలు..

అయితే.. వెంకటేష్ గతంలో కూడా పలుమార్లు కరెంటు పోల్ ఎక్కి విఘాతం కలిగించాడని పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.