
అమరావతి: విశాఖలోని యారాడ బీచ్లో విదేశీయుడు చనిపోయిన ఘటన కలకలం రేపింది. ఆదివారం మధ్యాహ్నం యారాడ బీచ్కి ఇటలీకి చెందిన 16 మంది విదేశీయులు వెళ్లారు. అందరూ ఎంజాయ్ చేయడానికి సముద్రంలోకి వెళ్లారు. వీళ్లలో ఇద్దరు అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. మిగిలిన విదేశీయులు హెల్ప్.. హెల్ప్ అని కేకలేయడంతో మెరైన్ పోలీసులు, జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ రంగంలోకి దిగారు.
సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరిని రక్షించి ఒడ్డుకి తెచ్చినప్పటికీ వాళ్లలో ఒకరు అప్పటికే చనిపోయాడు. మరో విదేశీయుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మృతుడి వివరాలు వెల్లడించేందుకు విదేశీయులు నిరాకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | భార్యతో గొడవ... కరెంటు పోల్ ఎక్కి వ్యక్తి హల్చల్...