సుహాస్ తమిళ్ సినిమా ‘మండాడి’ షూటింగ్లో ప్రమాదం.. సముద్రంలో మునిగిపోయిన కోటి రూపాయల కెమెరా

సుహాస్ తమిళ్ సినిమా ‘మండాడి’ షూటింగ్లో ప్రమాదం.. సముద్రంలో మునిగిపోయిన కోటి రూపాయల కెమెరా

సుహాస్ తమిళ్ సినిమా ‘మండాడి’ షూటింగ్లో ప్రమాదం జరిగింది. సముద్రంలో షూటింగ్ చేస్తుండగా పడవ బోల్తా పడింది. కోటి రూపాయల కెమెరాలు గంగపాలయ్యాయి. సినిమా షూటింగ్ చేస్తున్న హై ఎండ్ రెడ్ డిజిటల్ కెమెరాలు సముద్రంలో మునిగిపోవడంతో కోటి రూపాయల దాకా నష్టం వాటిల్లింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తమిళనాడులోని తొండి రామనాథపురం దగ్గర సముద్రంలో షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. తమిళ నటుడు సూరి లీడ్ రోల్‌‌లో నటిస్తున్న చిత్రం ‘మందాడి’. మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌‌మెంట్‌‌ సంస్థ నిర్మిస్తోంది.

స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు కొన్ని పోస్టర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇందులో సూరి ఇంటెన్స్ లుక్‌‌లో కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో తెలుగు నటుడు సుహాస్ తమిళ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సుహాస్‌‌తో పాటు మహిమా నంబియార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. క్రియేటివ్ ప్రొడ్యూసర్గా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తుండటం విశేషం.

►ALSO READ | 'ఏమి మాయ ప్రేమలోన': కేరళ బ్యాక్‌డ్రాప్‌లో స్వచ్ఛమైన ప్రేమకథ!