నేషనల్ హైవేపై మంటల్లో తగలబడిన రెండు కంటైనర్లు.. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

నేషనల్ హైవేపై మంటల్లో తగలబడిన రెండు కంటైనర్లు.. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగొంది గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ప్రోక్లీన్ లోడ్తో వెళ్తున్న కంటైనర్ను వెనక నుంచి మరో కంటైనర్ ఢీ కొట్టింది. మంటలు చెలరేగడంతో ముందున్న కంటైనర్ డ్రైవర్ దిగి పారిపోవడంతో ప్రాణాలు దక్కాయి. ప్రమాదం ధాటికి రెండు వాహనాల్లో మంటలు వ్యాపించాయి.

మంటల్లో రెండు వాహనాలు దహనమయ్యాయి. వాహనాల నుంచి మంటలు ఎగిసి పడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.