బ్యాంకాక్లో ఘోరం..పర్యాటకులు చూస్తుండగానే..జూకీపర్ను చంపిన సింహాలు

బ్యాంకాక్లో ఘోరం..పర్యాటకులు చూస్తుండగానే..జూకీపర్ను చంపిన సింహాలు

అతని వృత్తి జూకీపర్..40యేళ్లుగా ఎన్నో సింహాలను, పులులను, రకరకాల వన్యప్రాణులకు తిండి పెట్టి మరీ సాకాడు..చివరికి వాటి నోటికి ఆహారం అయ్యాడు.. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ జూలో పర్యాటకులు చూస్తుండగానే జూ కీపర్‌పై సింహాలు దాడి చేసి చంపేశాయి. ఎంత సాకినా..క్రూరమృగం కౄరమృగమే కదా..ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. వాటికి ఆహారం కావాల్సిందే అనేందుకు ఇది ఒక ఉదాహరణ..ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సెప్టెంబర్ 10న థాయ్ లాండ్ సఫారీ వరల్డ్ లో జూకీపర్ ను సింహాల గుంపు దాడి చేసిన ఘటన కు సంబంధించిన వీడియోవైరల్ అయ్యింది. జూ కీపర్ గా పనిచేస్తున్న 58 యేళ్ల జియాన్ లంగ్కరసామిని సింహాలు దాడి చేసి పీక్కుతింటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. టూరిస్టులను సింహాలు ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లిన సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకాక్ సఫారి వరల్డ్ అధికారులు కూడా ధృవీకరించారు. పర్యాటకుల సేఫ్టీ కోసం దాడి జరిగిన ప్రాంతాన్ని మూసివేశారు. 

సింహాల ఎంక్లోజర్ దగ్గరకు టూరిస్టులను తీసుకెళ్లిన జూకీపర్ జియాన్ లంగ్కరసామి వాహనం నుంచి దిగడంతో  సింహాలు గుంపులుగా వచ్చి అతనిపై దాడి చేశాయి. సందర్శకులు సఫారీ వాహనం లోపల నుంచి వణికిపోతూ ఈ భయంకరమైన దృశ్యాన్ని చూశారు.

మరో జూకీపర్ జియాన్‌ను త్వరగా రక్షించి ఆస్పత్రికి తరలించినప్పటికీ అతనికి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.సింహాలు ఆహారం తింటుండగా ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు జూ అధికారులు. మూడ్ బాగోలేకపోవడం వల్లే సింహాలలో ఒకటి దాడి చేసిందని అని చెబుతున్నారు. 

గత 40 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు. మేం సందర్శకులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. సఫారీ వాహనాల నుంచి బయటకు రావద్దని మేం గట్టిగా చెపుతున్నాం.ముఖ్యంగా వన్యమృగాలు సంచరించే ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని సఫారీ వరల్డ్ చెబుతోంది.