
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు అడ్వొకేట్ సోమ భరత్ విచారణ ముగిసింది. ఐదు గంటల పాటు సోమ భరత్ ను విచారించింది ఈడీ. కవిత మార్చి 21న సమర్పించిన సెల్ ఫోన్లను ఈడీ సోమ భరత్ ముందు ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది.
కవితను ఈ కేసులో మూడు రోజుల పాటు విచారించింది. మార్చి 11, 20,21న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను విచారించారు అధికారులు. అయితే కవితకు ఈడీ లేఖ రాసింది. కవిత అందజేసిన ఫోన్లు ఓపెన్ చేసే ముందు స్వయంగా హాజరుకావడం లేదా? తన ప్రతినిధిని పంపాలని ఈడీ లేఖలో పేర్కొంది ఈ క్రమంలోనే ఈడీ కార్యాలయానికి సోమ భరత్ వెళ్లారు.