Little Hearts: ఘాటి, మదరాసి పోటీగా.. రేపు (Sep5) థియేటర్లో ‘లిటిల్‌‌ హార్ట్స్‌‌’ హంగామా

Little Hearts: ఘాటి, మదరాసి పోటీగా.. రేపు (Sep5) థియేటర్లో ‘లిటిల్‌‌ హార్ట్స్‌‌’ హంగామా

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లిటిల్‌‌ హార్ట్స్‌‌’. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ ఆదిత్య హాసన్‌‌ నిర్మించాడు. నిర్మాత బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేటర్స్‌‌లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు శుక్రవారం (సెప్టెంబర్ 5న) గ్రాండ్గా విడుదల కానుంది.

ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రీమియర్స్ షోలు పడనున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ వంటి ప్రధాన నగరాల్లో సెలెక్టెడ్ థియేటర్లో షోలు ప్రదర్శించనున్నారు. రేపు శుక్రవారం పడనున్న షోలకి ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. ఇందుకు గల కారణం లేకపోలేదు.. ఒకటి స్కూల్ బ్యాక్‌‌డ్రాప్ అయితే, మరొకటి యూత్‌‌ ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌ కంటెంట్‌‌ ఉండటం.

ఇప్పటికే, రిలీజైన టీజర్, ట్రైలర్ విజువల్స్.. ఆ ఫ్రెష్ క్రేజీ ఫీలింగ్ తీసుకొచ్చాయి. అంతేకాదు అందుకు తగ్గట్టుగానే మేకర్స్ ప్రమోషన్స్ చేస్తూ, కొత్త ప్రోమోస్ రిలీజ్ చేస్తూ ఆకర్షిస్తూ వస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే.. ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేలా ఉంది. ముఖ్యంగా మౌళి, శివానీ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకుంటోంది. కాలేజ్ లైఫ్, కుర్రాళ్ల తుంటరి పనులు, అమ్మాయిల వెనక తిరగడం, ఎమ్‌సెట్ ప్రిపరేషన్.. ఇలా ప్రతిదీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. రేపు శుక్రవారం ఈ చిన్న సినిమాతో పాటుగా మరో రెండు పెద్ద మూవీస్ వస్తున్నాయి. అందులో ఒకటి మన తెలుగు మూవీ ఘాటి (GHAATI). అనుష్క-క్రిష్ కాంబోలో వస్తున్న క్రైమ్ డ్రామా ఇది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

మరొకటి తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘మదరాసి’. శివకార్తికేయన్-మురుగదాస్ కలయికలో వస్తుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్. విద్యుత్ జమ్వాల్ విలన్‌‌గా నటించాడు.