ఖమ్మం రూరల్, వెలుగు : సాగర్ కాల్వలో లారీ డ్రైవర్ గల్లంతయ్యాడు. ఖమ్మం రూరల్ సీఐ ముష్క రాజు తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా, జైల్కోట్ గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ రసూల్ (50) లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. భువనేశ్వర్ నుంచి ముంబాయి లారీ కిరాయికి వెళ్తున్నాడు.
ఏదులాపురం మున్సిపాలిటీ మద్దులపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న సాగర్ కాల్వలో ఆదివారం బట్టలు ఉతుక్కుని, స్నానం చేసేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు జారి కాల్వలో పడిపోయాడు. ఈత రకపోవడంతో గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సుమారు మూడు గంటల పాటు గాలించినా ఆచూకీ దొరకలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
