ఐపీఎల్‌లో యశ్‌ ఠాకూర్ సెన్సేషనల్‌ రికార్డు

ఐపీఎల్‌లో యశ్‌ ఠాకూర్  సెన్సేషనల్‌ రికార్డు

ఎకానా క్రికెట్ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో  లక్నో సూపర్ జెయింట్ గుజరాత్ టైటాన్స్‌పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.  164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  గుజరాత్ 130 పరుగులకే ఆటను ముగించింది. దీంతో లక్నో సూపర్‌‌‌‌జెయింట్స్‌ ఈ సీజన్ లో‌‌‌ హ్యాట్రిక్‌‌‌‌ విజయాలను అందుకుంది.  లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించిన  యువ బౌలర్ యశ్‌ ఠాకూర్‌కి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 

ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి  ఈ ఐపీఎల్‌లో అరుదైన ఘనతను తన పేరిట నమోదు చేసుకున్నాడు యశ్.  అదేంటంటే ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి (ఇన్నింగ్స్‌ 15వ ఓవర్) మెయిడిన్‌ చేసిన బౌలర్‌గా అవతరించాడు. దీంతోపాటు ఈ సీజన్‌లో తొలి ఫైఫర్ (ఐదు వికెట్లు) తీసిన బౌలర్‌గానూ నిలిచాడు.  

అనంతరం యశ్‌ ఠాకూర్‌ మీడియాతో మాట్లాడుతూ... ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఆనందంగా ఉందన్నాడు.  ముఖ్యంగా   గిల్‌ను ఔట్‌ చేయడమే గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో తొలిసారి గుజరాత్‌పై మేం విజయం సాధించామని తెలిపాడు.  మరోవైపు గుజరాత్‌పై ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా యశ్‌ ఠాకూర్‌ నిలిచాడు. అంతకుముందు ఉమ్రాన్‌ మాలిక్ (5/25), భువనేశ్వర్ కుమార్‌ (5/30) ఈ ఘనత సాధించారు. అయితే  వీరిద్దరూ హైదరాబాద్‌ బౌలర్లే కావడం విశేషం.